ఇన్‌స్పైర్‌కు 64 ప్రాజెక్టులు
జనగామ: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలను పెంపొందించేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2024–25 సంవత్సరానికి నిర్వహించిన ‘ఇన్ స్పైర్ మనక్’ ప్రాజెక్టుల ప్రదర్శనల్లో జిల్లా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. గత ఏడాది జిల్లా నుంచి 350 ప్రాజెక్టుల వరకు ఆన్‌లైన్ ద్వారా(నమూనా వీడియో/ప్రాజెక్టు పనితీరును వివరిస్తూ) విద్యార్థులు కేంద్రానికి పంపించారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రాజెక్టులను పరిశీలంచి ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. ఇందులో జిల్లా నుంచి 64 మంది ఇన్‌స్పైర్ అవార్డులకు ఎంపికయ్యారు. ఎంపికై న ప్రాజెక్టులను జిల్లా స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా కేంద్రం ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేల చొప్పున విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. జిల్లా స్థాయి ప్రదర్శన తర్వాత ఉత్తమంగా నిలిచిన వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో మేటిగా ఉన్నవాటిని న్యాయ నిర్ణేతలు జాతీయ స్థాయికి ఎంపిక చేయనున్నారు.
జాతీయ స్థాయిలో విద్యార్థుల ప్రతిభ
ఒక్కో ప్రాజెక్టుకు రూ.10వేలు
జిల్లా సైన్స్‌ఫెయిర్‌లో ప్రదర్శనకు సిద్ధం
సంతోషంగా ఉంది
రైతులు పొలాల వద్ద కరెంటు షార్ట్‌సర్క్యూట్‌కు గురికాకుండా యంత్రం తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆ ఐడియా ను పాఠశాలలో ఏర్పాటు చేసిన బాక్స్‌లో వేయగా సైన్స్ టీచర్ జిల్లా ఇన్‌స్పైర్‌కు పంపారు. జిల్లా స్థాయికి ఎంపికవడం సంతోషంగా ఉంది.
– గుర్రం అక్షయ, 9వ తరగతి, తిగుడు
మూడు ఎగ్జిబిట్లు పంపించాం..
మండలంలోని తిగుడు ఉన్నత పాఠశాల నుంచి ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల కోసం మూడు ఎగ్జిబిట్లు పంపించాం. 2025 జిల్లా స్థాయి ప్రదర్శనకు ఎంపికయ్యాయి. అందులో 9వ తరగతికి చెందిన గుర్రం అక్షయ ‘ఫార్మర్స్ లైఫ్ సేవింగ్స్ ఏసీ కరెంట్ డిటెక్టర్’, 8వ తరగతికి చెందిన గడిపెల్లి అక్షిత ‘స్మార్ట్ స్ట్రీట్‌లైట్స్ సిస్టం’, 7వ తరగతికి చెందిన మరో విద్యార్థి ‘మోడ్రన్ బల్క్ కార్ట్’ ఎగ్జిబిట్లు ఉన్నాయి. వీటిని జిల్లా స్థాయిలో ప్రదర్శించాలి.
– డి.శ్రవణ్‌కుమార్, ఫిజికల్‌సైన్స్ టీచర్, జఫర్‌గఢ్
ఇన్‌స్పైర్‌కు 64 ప్రాజెక్టులు
ఇన్‌స్పైర్‌కు 64 ప్రాజెక్టులు
Comments
Please login to add a commentAdd a comment