ఆస్తి పన్ను వసూలుకు వినూత్న చర్య | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను వసూలుకు వినూత్న చర్య

Published Sun, Mar 9 2025 1:38 AM | Last Updated on Sun, Mar 9 2025 1:35 AM

ఆస్తి పన్ను వసూలుకు వినూత్న చర్య

ఆస్తి పన్ను వసూలుకు వినూత్న చర్య

జనగామ : మున్సిపాలిటీలో పేరుకుపోయిన ఆస్తి పన్ను వసూలుకు అధికా రులు వినూత్న పద్ధతిని అమలు చేస్తు న్నారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంట ఏరియాకు చెందిన ఓ ఇంటి య జమాని ఇంటిపన్ను బకాయి రూ.27వేలు చెల్లించాల్సి ఉంది. వసూలు చేయడానికి శనివారం మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, మేనేజర్‌ రాములు, ఆర్‌ఓ బాబు, ఆర్‌ఐ ఏలియా, ఇతర అధికారులు మధు, సిబ్బంది ఆ ఇంటి ఎదుట సాయంత్రం 6 గంటలకు బైఠాయించారు. బకాయి చెల్లించే వరకు కదిలేది లేదని తేల్చి చెప్పారు. ఈ అనూహ్య చర్యతో యజమాని ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రెండురోజుల సమయం కావాలని అడిగినా అధికారులు ససేమిరా అన్నారు. చేసేది లేక రెండు గంటల తర్వాత రూ.8వేలు చెల్లించి.. మిగతా డబ్బులు వారం రోజుల్లోగా కట్టేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పన్ను ల వసూళ్ల కోసం అధికారులే స్వయంగా ఆందోళనకు దిగడం చర్చ నీయాంశంగా మారింది.

యజమాని ఇంటి ఎదుట బైఠాయించిన కమిషనర్‌, అధికారులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement