ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
మంగళవారం శ్రీ 11 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
తోడబుట్టిన వారే కష్టపెడుతున్నరు..
జనగామ పట్టణంలోని శివాలయం వీధికి చెందిన గంట శ్రీలతకు పెళ్లి సమయంలో 50 గజాల స్థలాన్ని పుట్టింటి వారు కట్నం కింద ఇచ్చారు. ఏడు సంవత్సరాల క్రితం భర్త యోగానందు చనిపోవడంతో శ్రీలత ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తూ తన కూతురును పోషించుకుంటున్నది. ఓ బ్యాంకులో రుణం తీసుకుని ఉన్న కొద్ది స్థలంలో ఇల్లు కట్టుకున్నది. రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇంటి స్థలం ఇచ్చేయాలంటూ సోదరులు ఇబ్బందులకు గురి చేస్తుండడంతో ఆ అభాగ్యురాలు కలెక్టరేట్ మెట్లెక్కింది. ఇదిలా ఉండగా.. పెద్ద దిక్కు లేకపోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రీలత వద్దే ఉంటూ ధైర్యం చెబుతున్నారు. కూతురు కష్టాలు చూడలేక ఆ దంపతులు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోవడానికి రైల్వేట్రాక్ వద్దకు వెళ్లగా గమనించిన స్థానికులు కాపాడారు. కూతురుకు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు.
పక్క ఫొటోలోని వృద్ధ దంపతులు వెంకటకృష్ణయ్య, బుచ్చమ్మది చిల్పూరు మండలం శ్రీపతిపల్లి. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండో కుమారుడు రంగయ్య ఇల్లరికం వెళ్లగా, మిగతా వారు ఊరిలోనే ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదం జరగ్గా వెంకటకృష్ణయ్య కాలు తొలగించారు. అప్పటి నుంచి ఆ దంపతులకు కష్టాలు మొదలయ్యాయి. అప్పటికే ముగ్గురు కుమారులు ఉన్న భూమి పంచుకుని తల్లిదండ్రులకు బువ్వ పెట్టకుండా ఇబ్బందుల కు గురిచేస్తుండడంతో ఆ పండుటాకులు న్యాయం కోసం తహసీ ల్దార్, ఆర్డీఓను ఆశ్రయించారు. ‘కొడుకులు అన్నం పెట్టడంలేదు.. ఓ చిన్న గదిలో వండుకుంటున్నాం’ అంటూ ఆ దంపతులు కలెక్టర్‌తో తమ కష్టాలు చెప్పుకుని విలపించారు. ‘ఆర్డీఓకు ఆదేశాలు ఇచ్చా.. వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది.. వెళ్లి కలవండి’ అంటూ కలెక్టర్ వారికి భరోసా కల్పించారు.
న్యూస్‌రీల్
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
ఒక్కొక్కరిది ఒక్కో సమస్య
Comments
Please login to add a commentAdd a comment