నీరు, గడ్డి లేక గోవుల మృతి
పాలకుర్తి టౌన్: గోశాలలో సరైన తాగునీరు, గడ్డి అందుబాటులో లేక గోవులు మృతి చెందాయని గోసంరక్ష ప్రముఖ్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, రాష్ట్రీయ హిందూ పరిషత్ అధ్యక్షుడు భూపాల్, లీగల్ కమిటీ ప్రముఖ్ అడ్వకేట్ అనిత ఠాకూర్ అన్నారు. మండ ల కేంద్రంలోని గోశాల నిర్వాహకుల నిర్లక్ష్యంతో గోవులు చనిపోతున్న విషయం తెలుసున్న వీరు సోమవారం గోశాలను సందర్శించి వివరాలను సేకరించారు. అర్హులైన రైతులకు గోవులను ఇచ్చేలా చూడలని స్థానిక పోలీస్‌సేష్టన్‌లో ఎస్సై పవన్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూ పరిరక్షణ సమితి, గోసంరక్షణ జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ ప్రముఖ్ పసునూరి సందీప్, నగేష్, స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
● గోసంరక్ష ప్రముఖ్ గుమ్మడవెల్లి శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment