రైతుల గోస పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం
జనగామరూరల్/స్టేషన్‌ఘన్‌పూర్/రఘునాథపల్లి/బచ్చన్నపేట/జఫర్‌గఢ్/పాలకుర్తి టౌన్/దేవరుప్పుల: ఒకవైపు పంటలు ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస పట్టించుకోవ డం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నా రు. సోమవారం ఆయన జిల్లాలో పర్యటించారు. వివిధ మండలాల్లో ఎండిన పంటలను, జఫర్‌గఢ్ లో అసంపూర్తిగా ఉన్న దేవాదుల కాల్వలను, పాలకుర్తిలో రిజర్వాయర్ల పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా కేంద్రం, ఘన్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ గండిరామవరం, బొమ్మకూరు, చిటకోడూరు, నవాబ్‌పేట, ఆర్‌ఎస్సార్ ఘనపూర్, అశ్వరావుపల్లి, కన్నబోయినగూడెం, వెల్దండ రిజ ర్వాయర్లలో ఫిబ్రవరి మొదటి వారంలోనే నీరు అడుగంటి కాల్వల్లో నీరులేక పంటలు ఎండిపోయే దశకు వచ్చాయన్నారు. జిల్లాలో 1లక్ష 66 వేల ఎకరాల్లో రైతులు వరి సాగుచేస్తే ఇప్పటికే 45శాతం సాగునీరు అందక పొలాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలు రాక భూగ ర్భ జలాలు అడుగంటి రైతులు అరిగోస పడుతున్నారని, చెరువులు కుంటలు నింపి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు అప్పులు తెచ్చి వరి వేస్తే ఫలితం లేకుండా పోయిందని, ప్రభుత్వం బాధ్యత వహించి ఎకరాకు రూ.50వేలు పరిహారం ఇవ్వాల ని డిమాండ్ చేశారు. ఈనెల 16న సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్‌కు వస్తున్నందున ముందే ఎండిన పంటలపై సర్వే నిర్వహించి నష్టపరిహారంపై ప్రకట న చేయాలన్నారు. జాన్‌వెస్లీ వెంట రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్, జిల్లా కార్యదర్శి కనకారె డ్డి, రాపర్తి రాజు, ఇరి అహల్య, యాదగిరి, రమేష్, శేఖర్, వెంకటేష్, విజేందర్, ఎల్లయ్య, రవీందర్‌రెడ్డి తదితరులున్నారు. ఇదిలా ఉండగా.. స్టేషన్‌ఘన్‌పూ ర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కటించాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. ఇక్కడి నిరుద్యోగులకోసం పరిశ్రమలు నెలకొల్పాలన్నారు.
ఎండిన పంటలకు పరిహారం చెల్లించాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
Comments
Please login to add a commentAdd a comment