ప్రకృతికి హాని తలపెట్టొద్దు
జనగామ: ప్రకృతికి హాని తలపెట్టకుండా జీవనం సాగించాలని జనగామ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్ పిలుపునిచ్చారు. ‘పర్యావరణ పరిరక్షణ’ అనే అంశంపై గురువారం జిల్లా కేంద్రంలోని సుభా ష్ చంద్రబోస్ అర్బన్ రెసిడెన్షియల్‌లో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన సదస్సులో జడ్జి మాట్లాడారు. మానవ జీవితంలో ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ బ్యాగులు, బాటిల్స్‌కు స్వస్తి పలకాలన్నారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటి ని సంరక్షించాలని, నీటిని పొందుపుగా వినియోగించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని, పిల్లలు ఇబ్బందులకు గురై తే లెటర్ లేదా జిల్లా లీగల్ సెల్‌కు సమాచారం ఇస్తే చట్టపరంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జడ్జి చేతలు మీదుగా పిల్లలకు జ్యూట్ బ్యాగులు పంపిణీ చేశారు. వివేకానంద ట్రస్టు ప్రధాన కార్యదర్శి దొంతుల శేఖర్, పాఠశాల అధికారి శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, జిల్లా న్యాయవాది మంచాల రవీందర్, అన్నబోయిన సత్యం తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి విక్రమ్