పోలవరం కాలువ పనుల అడ్డగింపు
తుని రూరల్: పోలవరం ఎడమ ప్రధాన కాలువపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తూ తాళ్లూరు గ్రామస్తులు, రైతులు శనివారం మరోసారి ఆందోళన చేశారు. కాలువ తవ్వకం పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించ లేదు. ఎప్పటిలాగే డీఈ మురళి, ఏఈ వచ్చి ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు. బాధితులు ఆందోళన విరమించకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు, పోలీసులతో అక్కడకు చేరుకుని, పనులు అడ్డుకోరాదని, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. జాతీయ ప్రాజెక్టు పనులు అడ్డుకోవడం సరికాదని రూరల్ ఎస్సై బి.కృష్ణామాచారి అన్నారు. తమ సమస్యపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయాలని, జిల్లా స్థాయి అధికారుల వద్దకు వెళ్లాలని చెప్పారు. అప్పటి వరకూ రోడ్డు మార్గాన్ని తొలగించబోమని తెలిపారు. ఇదే సమస్యపై గత నెల 25, 27 తేదీల్లో గ్రామస్తులు ఆందోళన చేయగా, బ్రిడ్జి నిర్మాణంపై అధికారులు ఎటువంటి హామీ ఇవ్వలేదు. ప్రత్యామ్నాయం పరిశీలిస్తామని అసిస్టెంట్ కలెక్టర్ భావన, పెద్దాపురం ఆర్‌డీఓ శ్రీరమణి, పోలవరం ఇరిగేషన్ ఈఈ గోవిందు చెప్పారు. దీంతో, కలెక్టర్ వద్దకు వెళ్లి తమ ఇబ్బందులను వివరిస్తామని గ్రామస్తులు, రైతులు పేర్కొని ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment