వ్యక్తి అదృశ్యం
కొవ్వూరు: వాడపల్లి గ్రామానికి చెందిన డొంకిన నాగర్జున (28) శుక్రవారం ఇంటి నుంచి అదృశ్యమైనట్టు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పి.విశ్వం తెలిపారు. పలుచోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదన్నారు.
భార్య దుర్గ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. నాగార్జున లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు. తన గురించి వెతకవద్దని మెసేజ్ పెట్టినట్టు ఆ ఫిర్యాదులో దుర్గ పేర్కొన్నారు. నాగార్జునకు వేరోకరితో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా చెబుతున్నారు. వివరాల తెలిసిన వారు 94407 96622 నంబర్‌కు కాల్ చేయాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment