కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ జిల్లా పరిషత్, మున్సిపల్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సీనియార్టీ జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా విద్యాశాఖదికారి వారి వెబ్‌సైట్‌లో ఉంచినట్టు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్ తత్సమానమైన ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు. పీఈటీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ పండిట్ ఉపాధ్యాయులు తదితర ఉపాధ్యాయులు సీనియార్టీ వివరాలు జిల్లా విద్యాశాఖాధికారి వెబ్‌సైట్‌లో ఉంచినట్టు డీఈవో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఉన్న సీనియార్టీ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత నమూనా ప్రొఫార్మాతో శని, ఆదివారాలలో కార్యాలయ పని వేళలలో సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment