సాగులో వనితర సాధ్యులు
ప్రేమాదరణకు ‘సిరి’
సామర్లకోట: పట్టణంలోని సిరి మానసిక దివ్యాంగుల కేంద్రం అక్కడి విద్యార్థులకు ప్రేమాదరణలతో విరాజిల్లుతోంది. సుమారు వంద మంది మానసిక దివ్యాంగులకు వివిధ రకాల సేవలు అందించడమే కాకుండా, వారు ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి వృత్తి శిక్షణ ఇస్తున్నారు సంస్థ నిర్వాహకురాలు గోపీదేవి. సాధారణ మహిళగా 1994లో పెద్దాపురం రోడ్డు బడేలమ్మ చెరువు ఎదురుగా మానసిక దివ్యాంగుల సేవా సంస్థ సిరి స్థాపించారు. అనేక మందికి ఈ సంస్థ సేవలందిస్తూ, మానసిక పరిస్థితి సక్రమంగా లేనివారికి ఆమె ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. దాంతో ఆమె ఇప్పటి వరకు అనేక సేవా పథకాలను అందుకున్నారు. నిరుపేద మహిళలకు ఉచితంగా విద్య, వసతి, ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా మానసిక వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ ఆ వెలుగుల్లో తానూ ప్రకాశిస్తూ తన జీవితానికి అర్థం పరమార్థం సేవలోనే లభిస్తుందని ఎంతో ఆనందం వెలిబుచ్చారు గోపీదేవి.
శ్రీకాకుళంలో బీఏ పట్టా తీసుకున్న అనంతరం మానసిక వికలాంగులకు సేవ చేయాలనే కోరికతో మెంటల్ రిటార్డేషన్‌లో డిప్లామా కోర్సు చేశారు. తండ్రి దాశెట్టి సూర్యకుమార్ ఇచ్చిన రూ.రెండు లక్షలతో తాత అప్పలరాజు స్వస్థలమైన సామర్ల కోటలో మానసిక వికలాంగుల సేవాసంస్థ ‘సిరి’ని స్థాపించారు. తల్లిదండ్రుల ఆర్థిక సహాయంతోనూ, ప్రజల నుంచి సేకరించిన విరాళాలతోనూ సంస్థ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరంలో సిరికి ప్రభుత్వ గుర్తింపు లభించింది. మతిస్థిమితం లేని బాలబాలికలకు ఉచిత విద్య, భోజనం, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, శారీ పెయింటింగ్, సర్ఫ్ తయారీ, రీడింగ్, రైటింగ్, ప్రవర్తనా సర్దుబాటు, వృత్తి విద్యల్లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నారు. ఆమె సేవలకు రాష్ట్ర ప్రభుత్వం 10 సార్లు ‘బెస్ట్ సోషల్ వర్కర్’ అవార్డులు ఇచ్చింది. కేవలం అవార్డుల కోసం కాకుండా మానసిక పరిపక్వత లేని 5–15 సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలకు శిక్షణ ఇస్తున్నట్టు గోపీదేవి తెలిపారు.
● ఇంటి పని నుంచి పంట పనిలోకి..
● అగ్రి‘కల్చర్’లో దూసుకుపోతున్న
మహిళలు
● ప్రకృతి వ్యవసాయ రంగంలో
మహిళామణులు
పిఠాపురం: ఈ వనితలు చెట్టూ పుట్టా గట్టూ దాటుకుంటూ చేలల్లో కలియతిరుగుతూ పురుషులకు దీటుగా పని చేసి చూపిస్తున్నారు. పురుషులు మాత్రమే చేయగలరనే వ్యవసాయ రంగంలోను తమకు సాటి లేరని నిరూపిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ శాఖలోని మహిళలు వ్యవసాయ రంగంలో ఇష్టపడి మరీ అడుగు పెట్టి రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దుక్కి దున్నే నాటి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులకు తలలో నాలుకగా ఉంటున్నారు. కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌గా పనిచేస్తున్న మహిళలు రైతుల పొలాలు, ఇంటి పరిసరాల పరిశీలించి కిచెన్ గార్డెన్‌లు, సూర్య మండలం మోడల్స్, ఏటీఎం మోడల్స్, ఏ గ్రేడ్ మోడల్స్ రైతులతో వేయిస్తూ ప్రకృతి వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రైతులు పొలంలో పంటకు ముందు పచ్చి రొట్ట ఎరువులు వేయించి భూమిలో కర్పన శాతం పెంచేలా చేస్తున్నారు. రైతులు పొలాల్లో కెమికల్స్ స్ప్రే చేయకుండా కషాయాలపై ఒక అవగాహనా కల్పిస్తూ, రక్షక పంటలు అంతర పంటలు వేయిస్తూ రైతు ఆదాయం పెంచడంతోపాటు, రైతు కుటుంబాల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. గతంలో వ్యవసాయ రంగంలో కేవలం మహిళలు కూలీలుగా మాత్రమే కనిపించే వారు. కానీ ఇప్పుడు పకృతి వ్యవసాయ శాఖలో సీఆర్పీలు 90 శాతం మంది మహిళలే ఉండడం మారిన పరిస్థితికి అద్దం పడుతుంది. అలాంటి వనితల్లో కొందరిని పలకరిస్తే ...
ఇంటి పంటపై
మహిళలకు
అవగాహన కల్పిస్తూ
వ్యవ‘సాయం’ చేయాలనే
నేను ఇంటర్ వరకు చదువుకున్నా. మాది రైతు కుటుంబం. చిన్నప్పటి నుంచి మానాన్న వ్యవసాయం చేయడం చూస్తుండే దానిని. సరదాగా మాఇంటికి దగ్గరలో ఉన్న పంట పొలాల్లో ఆడుకుంటూ వ్యవసాయం చూసి ముచ్చటపడి మా నాన్నకు చేదోడువాదోడుగా ఉండే దాన్ని. అలా వ్యవసాయంపై మక్కువ ఏర్పడి అవకాశం కోసం ఎదురు చూస్తుండగా కమ్యూనిటీ రిసోర్సు పర్సన్‌గా ఐసీఆర్పీగా అవకాశం వచ్చింది. దీంతో ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల్లో, మహిళల్లో అవగాహన కల్పిస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండించడానికి కృషి చేస్తున్నాను. ఉద్యోగం చేయాలన్న కోరిక తీరడంతో పాటు ఆసక్తి ఉన్న వ్యవసాయంలో పని చేయడం చాలా సంతృప్తినిస్తోంది. – శ్రీరంగ రామేశ్వరి, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ, దుర్గాడ, గొల్లప్రోలు మండలం
ఆనందంగా ఉంది
పొలాల్లో తిరిగే ఉద్యోగంలోకి అడుగు పెట్టేటప్పుడు నేను చేయగలనా అనే భయాందోళన కలిగింది. కానీ ప్రకృతిని కాపాడుకునే ఉద్యోగం అని తెలిసి పట్టుదలతో చేసి తక్కువ సమయంలోనే మంచి ఫలితాలను సాధించి నా సత్తా నిరూపించుకుంటున్నాను. అందరూ తెలుసున్న వారే కావడంతో రైతులు పూర్తి సహకారం అందిస్తున్నారు. మా గ్రామంలో ఇంటి పంటలు వేయిస్తూ ఎవరికి ఎక్కడా కూరగాయల ఇబ్బంది లేకుండా చేయగలిగాం. అటు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని పరుగులు పెట్టిస్తున్నాం.
– రోజా, ప్రకృతి వ్యవసాయ శాఖ సీఆర్పీ దుర్గాడ, గొల్లప్రోలు మండలం
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
సాగులో వనితర సాధ్యులు
Comments
Please login to add a commentAdd a comment