
ఆకట్టుకున్న సూక్ష్మ బంగారు వరల్డ్ కప్
పెద్దాపురం: ఐసీసీ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా మూడోసారి విజేతగా నిలిచిన సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు గ్రహీత, పట్టణంలోని బంగారు శిల్పి తాళాబత్తుల సాయి సూక్ష్మ బంగారు వరల్డ్ కప్‌ను రూపొందించారు. కేవలం 40 నిమిషాల సమయంలో 0.100 మిల్లీ గ్రాముల బంగారంతో 10 మిల్లీమీటర్ల పొడవు కలిగిన వరల్డ్ కప్‌ను తయారు చేసి, పలువురి మనన్నలు అందుకున్నారు.
మూల్యాంకన విధులపై
సమావేశం
బాలాజీచెరువు(కాకినాడ): పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై సోమవారం విద్యా శాఖ ఆర్‌జేడీ నాగమణి సమావేశం నిర్వహించారు. స్థానిక రామకృష్ణ పబ్లిక్ స్కూల్లో జోన్–2కు సంబంధించి కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల డీఈఓలు, పరీక్షల విభాగ ఏసీ, సీసీలతో సమావేశం జరిగింది. మూల్యాంకన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఈ సమావేశంలో డీఈవోలు పిల్లి రమేష్, నారాయణ పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సూక్ష్మ బంగారు వరల్డ్ కప్
Comments
Please login to add a commentAdd a comment