ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక
కాకినాడ సిటీ: హోప్ ఐలాండ్‌లో ఎకో టూరిజంని అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందుమాధవ్, అటవీశాఖ అధికారి ఎ.రవీంద్రనాథ్‌రెడ్డి, పోరుట అధికారి కెప్టెన్ ధర్మశాస్త్ర, అటవీ, పర్యాటక, మత్స్య, మైరెన్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి హోప్ ఐలాండ్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం కార్యాలయం నుంచి హోప్‌ఐలాండ్‌కు చేరుకుని అక్కడి ప్రదేశాలను పరిశీలించారు. ఎకో టూరిజం అభివృద్ధికి అనువుగా ఉన్న పరిస్థితులు, హోప్‌ఐలాండ్ పరిధి, మడ అడవులు, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు బోటింగ్ సౌకర్యం ఇతర అంశాలనుకలెక్టర్ షణ్మోహన్ ఆయా శాఖల అధికారులతో చర్చించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోప్‌ఐలాండ్ ప్రాంతాన్ని పర్యాటక రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి కె.కరుణాకర్‌బాబు, ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, సెక్షన్ అధికారి ఎం. నాగార్జున, అసిస్టెంట్ టూరిజం అధికారి వి.త్రిమూర్తులు, వాటర్ ప్లీట్ అసిస్టెంట్ మేనేజర్ గంగాబాబు, పోర్ట్ సీఐ పి సునీల్‌కుమార్, మైరెన్ ఎస్‌ఐ పి సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ షణ్మోహన్
Comments
Please login to add a commentAdd a comment