తలుపులమ్మకు బంగారు హారం
తుని రూరల్: లోవ తలుపులమ్మ అమ్మవారికి కాకినాడకు చెందిన భక్తులు కోకా వెంకట కోటేశ్వరఫణి, మైథిలి దంపతులు బంగారు హారాన్ని సమర్పించారు. సోమవారం లోవ దేవస్థానానికి వచ్చిన వారు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజుకు 102 గ్రాముల 575 మిల్లీ గ్రాముల బరువుగల హారాన్ని అందజేశారు. వేద పండితులు, ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం చేశారు. వీరిని అమ్మవారి శేషవస్త్రాలతో ఈఓ సత్కరించి, ప్రసాదాలు అందజేశారు.
రాయచోటి ఘటనలో బాధ్యులను శిక్షించాలి
కాకినాడ సిటీ: హిందూవుల ఉత్సవాల్లో పోలీసుల జోక్యం, ఆంక్షలు పెంచడాన్ని సహించబోమని, రాయచోటి సంఘటనలో బాధ్యులను శిక్షంచాలంటూ కాకినాడ జిల్లా వీహెచ్‌పీ, హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. సోమవారం కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ షణ్మోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈనెల 4వ తేదీన వీరభద్రస్వామి ఉత్సవంలో హిందూవులపై ముస్లింలు చేసిన దాడిలో ముస్లింలను అదుపు చేయడంలో పోలీసులు హిందువులపై లాఠీ చార్జీ చేయడం దారుణమన్నారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరించి హిందూవులపై కేసులు బనాయించారన్నారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరసన ర్యాలీలు జరుగుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి అందేలా కలెక్టర్ షణ్మోహన్‌కు వినతిపత్రం అందజేసినట్టు ఆందోళనకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రాంత సేవా ప్రముఖ్ కేశవయ్య మాట్లాడారు. విశ్వహిందూ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షుడు రవిశంకర్ పట్నాయక్, బిక్కిన విశ్వేశ్వరరావు, గట్టి సత్యనాఆరయణ, మాలకొండయ్య, కృష్ణమోహన్, తుమ్మల పద్మజ, చోడిశెట్టి రమేష్‌బాబు, పైడా రవీంద్ర వెంకట్, కె అప్పాజీ, చెక్కా రమేష్, పద్మ, కమల, ఉమామహేశ్వరి తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్పందిస్తూ మంచి పనులకు ఎప్పుడూ సహకరిస్తామన్నారు.
ఇకపై డ్రోన్ భద్రత
పోలీస్ శాఖ సేవల కోసం 13 డ్రోన్లు
కాకినాడ క్రైం: జిల్లా పోలీస్ శాఖ శాంతి భద్రతల పర్యవేక్షణలో కీలక ముందడుగు వేసింది. భద్రతను డ్రోన్ల సాయంతో మరింత బలోపేతం చేయనుంది. అందులో భాగంగా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడలోని జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిఽథిగా హాజరై విభాగాల వారీగా ఎస్‌హెచ్‌వోలు, ఇన్‌స్పెక్టర్లకు డ్రోన్లు అందజేశారు. ఈ డ్రోన్లు ఆయా స్టేషన్ల పరిధిలో భద్రత, నిఘా కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించనున్నాయి. రూ.24 లక్షల వ్యయంతో ఈ డ్రోన్లు అందుబాటులోకి తెచ్చామని ఆయన తెలిపారు. విజిబుల్ పోలీసింగ్ విత్ ఇన్‌విజిబుల్ పోలీస్ నినాదంతో డ్రోన్ల పాత్ర శాంతిభద్రతల పర్యవేక్షణలో కీలకం కానుందని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు.
తలుపులమ్మకు బంగారు హారం
తలుపులమ్మకు బంగారు హారం
Comments
Please login to add a commentAdd a comment