
ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు
కంబాలచెరువు: ఆలోచన లేకుండా చేసే పనులతో ఇబ్బందులు ఎదురవుతాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. అక్కడి బాలురు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉచితంగా న్యాయవాదిని పొందే అవకాశం ఉందని తెలిపి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేయాలన్నారు. బాలురతో స్నేహ పూర్వకంగా ఉండాలని, వారికి మంచి ఆహారాన్ని అందించడంతో పాటు వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమైన వెంటనే చర్యలు తీసుకోవాలని సిబ్బందికి చెప్పారు. అనంతరం కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని బీసీ బాలికల సమీకృత సంక్షేమ వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అన్యాయం జరిగితే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. మంచి చెడు స్పర్శలకు తేడాలను విద్యార్థినులకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment