
పారదర్శకంగా పరీక్షల నిర్వహణ
రాజానగరం: పరీక్షల నిర్వహణ, సర్టిఫికెట్ల మంజూరు వంటి విషయాలలో పారదర్శకంగా ఉండాలని, ఎక్కడ తేడా వచ్చినా క్షమించేది లేదని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ హెచ్చరించారు. యూనివర్సిటీలో యూజీ, పీజీ పరీక్షల విభాగాలను బుధవారం ఆమె నిశితంగా పరిశీలించారు. అనంతరం డీన్ అండ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కార్యాలయంలో పరీక్ష విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న విధానం గురించి తెలుసుకుంటూనే ఆటోమేషన్ విధానాన్ని అమలు చేయడంపై ఆరా తీశారు. అనుబంధ కళాశాలలు ఎక్కువగా ఉన్నందున ఎక్కడా, ఎటువంటి సమస్య ఎదురుకాకుండా సమర్థంగా పరీక్షలు నిర్వహించడం కష్టతరమైన చర్యే అయినా సమష్టిగా పనిచేస్తే ఎటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా చూడవచ్చన్నారు. డీన్ ఆచార్య డి.కల్యాణి, ప్రత్యేకాధికారి డాక్టర్ కె.దీప్తి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ విజయకుమారి, సిస్టమ్ మేనేజర్ జ్యోతి పాల్గొన్నారు.
‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ
Comments
Please login to add a commentAdd a comment