
కంటిపూడి సుజుకి శాటిలైట్ డీలర్‌షిప్ ప్రారంభం
రావులపాలెం: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజమైన సుజుకి మోటార్ సైకిల్ అధీకృత డీలర్ కంటిపూడి సుజుకి నూతన శాటిలైట్ డీలర్ షిప్‌ను బుధవారం రావులపాలెంలో ప్రారంభించారు. కంటిపూడి సుజుకి షోరూమ్ అండ్ సర్వీస్‌ను సుజుకి సేల్స్ రీజినల్ మేనేజర్ శివరామకృష్ణ, కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్‌బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠమనేని వినయ్‌బాబు మాట్లాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడానికి అత్యాధునిక ఆటోమేటిక్ పరికరాలు కలిగిన వర్క్‌షాప్‌ను రూపొందించినట్టు తెలిపారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జగన్, సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.మన్మోహన్‌రామ్, సేల్స్ ఏఎం బాలకృష్ణ, సర్వీస్ ఏఎం సాయి, కంటిపూడి సుజుకి జీఎం రాజారావు, బ్రాంచ్ మేనేజర్ వంశీ, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment