
కామారెడ్డి: తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిందో భార్య. రాజంపేటలో అనుమానాస్పదంగా మృతి చెందిన గంగు లింగం హత్య కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం సీఐ తిరుపయ్య, ఎస్సై రాజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. గంగు లింగం భార్య లావణ్యకు పెద్దాయిపల్లి గ్రామానికి చెందిన శంకరిగారి గోవిందుతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.
ఈ క్రమంలో శుక్రవారం రాత్రి గోవిందుతో కలిసి భర్త లింగంను పెద్దాయిపల్లి శివారులో గల సిద్దుల గుట్ట ప్రాంతంలో గొంతు కోసి హత్య చేసింది. సోమవారం లావణ్య, గోవిందును అరెస్టు చేసి వారి నుంచి కత్తి, ఒక బైకు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment