జిల్లాస్థాయి సైన్స్ ప్రదర్శన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని భవిత పాఠశాలలో బుధవారం నేషనల్ గ్రీన్ కోర్(ఎన్జీసీ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు వ్యర్థ పదార్థాలనుంచి తయారు చేసిన వస్తువులను ప్రదర్శించారు. డీఈవో రాజు ప్రదర్శనలను వీక్షించి విద్యార్థులను అభినందించారు. ఈ ప్రదర్శనలో లింగంపేట ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు ప్రథమ, అచ్చంపేట మోడల్ స్కూల్ ద్వితీయ, లింగుపల్లి యూపీఎస్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలను అందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి సిద్దిరాంరెడ్డి, ఎన్జీసీ రాష్ట్ర కోఆర్టినేటర్ విద్యాసాగర్, ఉపాధ్యాయులు ప్రతాప్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, కృష్ణాకర్, సురేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అర్చరీ
పోటీలకు ఎంపిక
దోమకొండ : మండల కేంద్రంలోని గడికోట లో బుధవారం జిల్లా స్థాయి అర్చరీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ చూపి నవారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశా రు. రికర్వ్ బాలికల విభాగంలో కదిరె సిందూజ, బాలుర విభాగంలో అనుదీప్, ఇండి యన్ రౌండ్ బాలికల విభాగంలో ప్రీతి, బా లుర విభాగంలో రాహుల్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచ్ ప్రతాప్‌దాస్ తె లిపారు. రాష్ట్రస్థాయి ఎంపికై న క్రీడాకారుల కు దోమకొండ ఎస్సై ఆంజనేయులు బహుమతులు అందించారు. క్రీడాకారులను అర్చ రీ అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అని ల్ కామినేని, జిల్లా అధ్యక్షుడు తిరుమల్ గౌ డ్, సెక్రెటరీ మోహన్‌రెడ్డి, ట్రెజరర్ గంగాధర్ అభినందించారని కోచ్ తెలిపారు.
సెపక్‌తక్రా జిల్లా జట్టు..
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని కర్షక్ బీ ఈడీ కళాశాలలో బుధవారం సెపక్‌తక్రా జి ల్లా జట్టు ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ చూపినవారిని జిల్లా జ ట్లకు ఎంపిక చేశారు. వీరు ఈనెల 27, 28, 29 తేదీల్లో హన్మకొండలో నిర్వహించే రాష్ట్రస్థాయి సీఎం కప్ సెపక్‌తక్రా పోటీలలో పా ల్గొంటారని సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మల్లేష్, నరేష్ తెలిపారు.
బాలికల జట్టు: జి.పూజిత, బి.శ్రావ్య, ఏడీ.హల్యా, కె.పూజిత, భవ్యశ్రీ
బాలుర జట్టు: వి.హరీష్, జి.శివకుమార్, బి.దీపక్, ఈ.నితీష్‌గౌడ్, ఎస్.భరత్.
కానిస్టేబుల్ సస్పెన్షన్!
ఖలీల్‌వాడి/రెంజల్: రెంజల్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసులో కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పై ఇన్‌చార్జి సీపీ సింధుశర్మ చర్యలకు ఉపక్రమించారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ప్రసాద్‌ను గురువారం సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈనెల 12న రెంజల్ పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రత్నావత్ రెడ్యా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై ‘సాక్షి’లో ఈ ఘటనపై ప్రచురితమైన కథనంపై స్పందించిన ఇన్‌చార్జి సీపీ సింధుజీ శర్మ.. సీఐ, ఎస్సై, పోలీసు సిబ్బందిని మందలించినట్లు తెలిసింది. అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి మానవ హక్కుల సంఘం నివేదిక కోరగా జిల్లా అధికారులు పంపించినట్లు స మాచారం. ప్రస్తుతం న్యాయమూర్తితో జు డీషియల్ విచారణతో పాటు, మెదక్ జిల్లా తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి డిపార్ట్‌మెంట్ విచారణ జరుపుతున్నారు. కాగా రత్నావత్ రెడ్యా ఆత్మహత్యకు సంబంధించిన పోస్టు మార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బాధ్యులైన మిగతా పోలీసు సిబ్బందిపై చ ర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఏడుగురి రిమాండ్..
రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో మతిస్థితిమితం లేని బాలికపై లైంగిక దాడి జరిపాడని నిందితుడు రత్నావత్ రెడ్యాపై దాడి చేసిన 13 మందిపై పోలీసులు నమోదు చేశారు. ఇందులో ఏడుగురిని గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment