పాఠశాలలో ‘మధ్యాహ్నం’ బంద్!
నిజాంసాగర్ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘మధ్యాహ్నం’ బంద్ అయ్యింది. 18 రోజులుగా వంట చేయడం లేదు. పాఠశాలలో వంట చేయడానికి ఏజెన్సీ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పాఠవాలలో 230 మంది విద్యార్థులున్నారు. మండల కేంద్రంతోపాటు సుల్తాన్‌నగర్, గోర్గల్, మాగి గ్రామాల నుంచి ఉన్నత పాఠశాలకు వస్తుంటారు. ఈనెల ఒకటో తేదీనుంచి ఏజెన్సీ నిర్వాహకులు వంట చేయడం లేదు. దీంతో విద్యార్థులకు పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు విద్యార్థులు ఇంటినుంచి టిఫిన్ బాక్సులు తెచ్చుకుంటుండగా.. మరికొందరు పస్తులుంటున్నారు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు నెలల తరబడి రాకపోవడంతో వంట చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. అప్పులు చేసి వంట చేయలేమని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎవరూ ముందుకు
రావడం లేదు
పాఠశాలలో వంట చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అమ్మ ఆదర్శ కమిటీ ద్వారా వంట చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి చెప్పినా వంట చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు.
– రాంచందర్, ఉన్నత పాఠశాల
ప్రధానోపాధ్యాయుడు
వంట చేయడానికి ముందుకు రాని ఏజెన్సీ నిర్వాహకులు
ఇంటినుంచి బాక్సులు
తెచ్చుకుంటున్న విద్యార్థులు
పట్టించుకోని విద్యాశాఖ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment