వచ్చేనెల ఒకటిన పోచారం నీటివిడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి వచ్చేనెల ఒకటో తేదీన ఆయకట్టుకు నీటి విడుదలను ప్రారంభించనున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. యాసంగి పంటలసాగు కోసం నీటి విడుదలపై బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయకట్టు రైతులతో తైబంది సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం పోచారం ప్రాజెక్టులో 1.65 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది యాసంగి సీజన్‌లో ప్రాజెక్టు నీటిని ‘ఏ’ జోన్‌కు కేటాయించాల్సి ఉందన్నారు. ఐదు విడతలలో నీటిని అందించాలని నిర్ణయించామన్నారు. ఒక్కో విడతలో 15 రోజులపాటు నీటిని విడుదల చేస్తామని, రెండు విడతల మధ్య పది రోజుల పాటు నీటి విడుదల నిలిపివేస్తామని తెలిపారు. నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ ఏఈ అక్షయ్, మాజీ ఎంపీపీ రాజ్‌దాస్, మాల్తుమ్మెద సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్‌రెడ్డి, నాగిరెడ్డిపేట మాజీ సర్పంచ్ విఠల్‌రెడ్డి, నాయకులు కిష్టయ్య, ఇమామ్, శేఖర్, ఫారూక్, గులాం తదితరులు పాల్గొన్నారు.
ఐదు విడతలుగా ఆయకట్టుకు నీరు
తైబంది సమావేశంలో నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment