‘త్వరితగతిన రుణాలు అందించాలి’
అధికారులతో మాట్లాడుతున్న
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను త్వరితగతిన పంపిణీ చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో రుణ లక్ష్యాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రూ. 250 కోట్ల రుణాలు పంపిణీ చేయాలన్నది లక్ష్యమన్నారు. అర్హత కలిగిన మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా వచ్చేనెలాఖరులోగా రుణాలను పంపిణీ చేయాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బందితో సమీక్షించి రుణాల పంపిణీతో పాటు రికవరీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, డీపీఎం రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment