కామారెడ్డి క్రైం: కుమార్తైపె లైంగిక దాడి కేసులో తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్‌సింగ్ శ్రీనివాస్ నాయక్ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. బీబీపేట పీఎస్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన దేవరాజు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 15 ఏళ్ల కుమార్తైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లి వచ్చాక విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయగా బీబీపేట పీఎస్‌లో జనవరి 14న కేసు నమోదైంది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు పూర్వపరాలను పరిశీలించిన జడ్జి నిందితుడు దేవరాజుకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. కేసును సరైన పద్ధతిలో విచారించి, కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు ఆర్ ప్రకాశ్, శ్రీనివాసులు, నాగేశ్వర్ రావు, సీఐ తిరుపయ్య, సంపత్ కుమార్, ఎస్సై అనిల్, పీపీ శేషు, పోలీసు సిబ్బంది మురళీ, ప్రమోద్ రెడ్డి, ప్రవీణ్ లను ఎస్పీ సింధు శర్మ అభినందించారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో
ముగ్గురికి రెండు రోజులు..
ఖలీల్‌వాడి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ పి ప్రసాద్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 18 మందికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం వీరిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపర్చగా 15 మందికి రూ. 36,200 జరిమానా విధించారు. నగరంలోని కోటగల్లీకి చెందిన ఎస్ శ్రీనివాస్. నిర్మల్ జిల్లాకు చెందిన ఎం రాజేశ్, ఖిల్లారోడ్డులోని అఖిల్‌కు రెండు రోజుల జైలు శిక్షను జడ్జి విధించినట్లు ట్రాఫిక్ సీఐ పేర్కొన్నారు.
కమ్మర్‌పల్లిలో ఒకరికి..
కమ్మర్‌పల్లి: డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి రెండు రోజుల జైలు శిక్ష పడినట్లు కమ్మర్‌పల్లి ఎస్సై అనిల్‌రెడ్డి బుధవారం తెలిపారు. మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేస్తుండగా మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామానికి చెందిన గంగాధర బాబురావు అనే వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. అతన్ని ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ బాబురావుకు రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment