‘బాల్య వివాహాలను అడ్డుకోవాలి’
రాజంపేట: బాల్య వివాహాలు జరిపించడం చట్ట రీత్యా నేరమని, వాటిని అడ్డుకోవాలని జిల్లా సీని యర్ సివిల్ జడ్జి నాగరాణి పిలుపునిచ్చారు. సఖి కేంద్రం, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీల ఆధ్వర్యంలో బుధవారం కొండాపూర్ రైతు వేదికలో సీ్త్రలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఆడ మగ తేడా లేకుండా అందరినీ ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ల విషయంలో అలా చేయించినవారితోపాటు డాక్టర్లు కూడా శిక్షార్హులు అవుతారన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా సీ్త్రలు 181 నంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తారన్నారు. సఖి కేంద్రం అందిస్తున్న సేవలు, పోక్సోతోపాటు బాలికలు, మహిళల రక్షణకు ఉద్దేశించిన చట్టాలపై అవగాహన కల్పించారు. సఖి సెంటర్ పోస్టర్, బేటీ బచావో బేటీ పఢావో పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సఖి కేంద్రం నిర్వాహకులు భారతి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఫరీదా, సీడీపీవో సుష్మ, ఎస్సై పుష్పరాజ్, ఏపీఎం సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బాలసదనం తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని హరిజనవాడలోగల బాలసదనాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి బుధవారం తనిఖీ చేశారు. చిన్నారులతో మాట్లాడి సమస్యలు, సౌకర్యాలను గురించి తెలుసుకున్నారు. పిల్లలకు సంబంధించిన హక్కులను వివరించారు. ఆపరేషన్ స్మైల్‌లో కాపాడపడిన బాలికలను బడిలో చేర్పించాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది శ్రావణ్ కుమార్, సాయి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment