తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఎల్లారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా నీటి సమస్య రాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ బోరుబావులకు అవసరమైన మరమ్మతులు చేయించాలన్నారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీటిని అందించాలని సూచించారు. అనంతరం డంపింగ్ యార్డును పరిశీలించారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువులను తయారు చేయాలని సూచించారు. చె ట్లకు నీరు పట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment