ట్రాలీ ఆటో ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలు
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం తిప్పారం రోడ్డులోని ఎస్టీ హాస్టల్ వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు విద్యార్థులను ట్రాలీ ఆటో (టాటా ఏస్) వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలానికి చెందిన ఇద్దరు చిన్నారులు అర్జున్–4వతరగతి, సాయికల్యాణ్–3వ తరగతి (అన్నదమ్ములు) హాస్టల్ బయట ఉండగా, మండల కేంద్రంలోని ఓ వాటర్ ప్లాంటుకు చెందిన టాటా ఏస్ వాహనం నీటిక్యాన్‌లతో తిప్పారం వైపు వెళ్తుండగా వారిని ఢీకొట్టింది. ఈఘటనలో కల్యాణ తలకు బలమైన గాయాలు కాగా, అర్జున్ కాలు విరిగింది. క్షతగాత్రులను 108 అంబులెన్సులో కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ పీఈటీ ఫిర్యాదు మేరకు వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ అస్లామ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మెరుగైన వైద్యం అందిస్తున్నాం..
కామారెడ్డి క్రైం: ప్రమాదం విషయంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. వివరాలు తెలుసుకున్న ఆయన జరిగిన ఘటనపై ఆరా తీశారు. గాయపడిన ఇద్దరు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం వారిని నిజామాబాద్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని డీపీఆర్‌వో భీంకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొని..
ఇందల్వాయి: మండలంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై గన్నారం గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇందల్వాయి టోల్‌ప్లాజా సిబ్బందికి గాయాలయ్యాయి. పెట్రోలింగ్ వాహనంలో టోల్‌ప్లాజా సిబ్బంది ఒకరు రోడ్డు నిర్వహణ పనులు పర్యవేక్షిస్తున్న సమయంలో, కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు స్టీల్ లోడ్‌తో వేగంగా వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహన డ్రైవర్ వడ్ల బ్రహ్మం గాయపడ్డాడు. వెంటనే అతడిని టోల్‌ప్లాజా అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.
ట్రాలీ ఆటో ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలు
Comments
Please login to add a commentAdd a comment