బిచ్కుంద(జుక్కల్): మండలకేంద్రంలోని తహసీల్దార్ సురేష్ ఎదుట గురువారం ముగ్గురు వ్యక్తులను పొలీసులు బైండోవర్ చేశారు. సాయిలు, యాదవ్, నరేష్ అనే వ్యక్తులు చిన్నచిన్న దొంగతనాలకు పాల్పడుతుండేవారు. అలాగే దేవాడకు చెందిన రాజు అక్రమంగా మద్యం అమ్ముతుండేవాడు. ఈక్రమంలో వారిని పొలీసులు పట్టుకొని కేసునమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు.
ఒకరిపై పోక్సో కేసు నమోదు
రామారెడ్డి: మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గుజ్జుల నవీన్ అదే గ్రామానికి చెందిన ఓ 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుందని రామారెడ్డి ఎస్సై నరేష్ గురువారం తెలిపారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఒకరోజు జైలు
బోధన్‌టౌన్(బోధన్): మద్యం తాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి బోధన్ సెకండ్‌క్లాస్ మెజిస్ట్రేట్ ఒక రోజు జైలు శిక్ష విధించినట్లు సీఐ వెంకటనారాయ ణ గురువారం తెలిపారు. పట్టణంలోని శక్కర్‌నగర్ కాలనీకి చెందిన షేక్ హుస్సేన్ ఇటీవల మద్యం తాగి వాహనం నడుపుతుండగా, పోలీసుల డ్రంకన్‌డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఒకరోజు జైలు శిక్షను విధించాడని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment