కోళ్లకు అంతుచిక్కని వైరస్ సోకుతోంది. దీంతో 15 రోజులుగా కోళ్లు మృతిచెందుతున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో ఇక్కడా అదే వైరస్‌తో కోళ్లు మృతి చెందుతున్నాయని అనుమానిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన వెటర్నరీ అధికారులు.. కోళ్ల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోగల ల్యాబ్‌కు పంపించారు. వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఫలితాలు వచ్చేంతవరకు ఏ వైరస్‌తో కోళ్లు మృతిచెందుతున్నాయో చెప్పలేమని అధికారులు పేర్కొంటున్నారు.
గిరాకీ లేక..
వైరస్ సోకి కోళ్లు మృతిచెందుతూ ఓవైపు కోళ్ల ఫారాలు ఖాళీ అవుతుండగా.. మరోవైపు చికెన్ తినాలంటే జనం జంకుతున్నారు. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ చికెన్ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కోళ్ల అమ్మకాలు లేక ఇబ్బందిపడుతున్నామని చెకెన్ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల సంఖ్యలో కోళ్ల మృత్యువాత
మూతపడుతున్న కోళ్ల ఫారాలు
చికెన్ తినేందుకు జంకుతున్న జనం
వెలవెలబోతున్న చికెన్ సెంటర్లు
Comments
Please login to add a commentAdd a comment