జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి ఎంపికై న శరత్ చంద్ర
భిక్కనూరు: జమ్ముకాశ్మీర్‌లో వ చ్చే నెలలో జరుగనున్న అండర్–14 ఎస్‌బీఎఫ్ ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి భిక్కనూరుకు చెందిన కై రంకొండ శరత్‌చంద్ర ఎంపిక య్యాడని ఆదివారం కుటుంబసభ్యులు తెలిపారు.వనపర్తి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఫుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ చూపిన 11 మంది క్రీడాకారులను జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి ఎంపిక చేశారు.శరత్‌చంద్ర మెదక్ జిల్లా ఫు ట్‌బాల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈసందర్భంగా శరత్‌చంద్రను పలువురు అభినందించారు.
జోరుగా పంట నూర్పిళ్లు
బాన్సువాడ రూరల్ : మండలంలోని మెట్ట ప్రాంతాలైన గట్టుమీది గ్రామాల్లో జోరుగా పంట నూర్పి ళ్లు సాగుతున్నాయి. సాగునీటి సౌకర్యం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఈప్రాంతవాసులు మొక్కజొన్న, జొన్న తదితర పంటలు సాగు చేశారు. ముందస్తుగా వేసిన మొక్కజొన్న, జొన్న కోతకు రావడంతో నూర్పిడి పనులు సాగుతున్నాయి. వీటితో పాటు పలుచోట్ల రైతులు పుచ్చకాయ, మునగ తదితర పంటలు సాగు చేశారు.
జాతీయ స్థాయి ఫుట్‌బాల్ టోర్నీకి ఎంపికై న శరత్ చంద్ర
Comments
Please login to add a commentAdd a comment