ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలి
బీబీపేట: రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను ఇస్సానగర్ గ్రామ మాజీ సర్పంచ్ పొట్టి గారి పొట్టయ్య, గ్రామ నేతలు కలిసి కోరారు. అనంతరం వెంకటయ్యను వారు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ అధికారుల వద్ద ఎస్సీ, ఎస్టీ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులకు ప్రభుత్వ ఆఫీసులలో గుర్తింపు లేదని వారు ఆయనకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, బాబు, జోగు సురేష్, ప్రశాంత్, చిన్న బాబు, కమలాకర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment