అసెంబ్లీలో గొంతెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
నాగిరెడ్డిపేట/కామారెడ్డి టౌన్: జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో పలు అంశాలపై మాట్లాడారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు మదన్‌మోహన్‌రావు, కాటిపల్లి వెంకటరమణారెడ్డి వివిధ అంశాలను లేవనెత్తారు.
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
ఎల్లారెడ్డిని పర్యాటకంగా అభివృద్ధి చేయా లని ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కోరారు. నాగిరెడ్డిపేట, లింగంపేట, తాడ్వాయి, రా మారెడ్డి మండలాల్లోని పర్యాటకప్రాంతాలతోపాటు పలు దేవస్థానాల గురించి వివరించారు. పోచారం ప్రాజెక్టుతోపాటు అక్కడే ఉన్న నిజాంకాలంనాటి అతిథిగృహాలను, పోచారం అభయారణ్యాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలని కోరారు. అలాగే త్రిలింగేశ్వర, కాలభైరవస్వామి, భీమేశ్వరాలయాల వద్ద సౌకర్యాలు కల్పించాలని, నాగన్నబావిని పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందిస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు, నాగన్న బావి అభివృద్ధి చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాధానమిచ్చారు.
ఎమ్మెల్యేగా చెప్పినా పనులు కావడం లేదు
ఎమ్మెల్యేగా తాను చె ప్పినా కామారెడ్డి ని యోజకవర్గంలో పను లు కావడం లేదని కాటి పల్లి వెంకటరమణారె డ్డి సభలో వాపోయా రు. ఓడిపోయి వారు చె ప్పిన వాటికి మాత్రం నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. తాను రాష్ట్ర ప్రభుత్వానికి 84 ప్రశ్నలు అడిగితే ఇప్పటివరకు కనీసం 9శాతం ప్రశ్నలకు కూడా జవాబు చెప్పలేదన్నారు. అధికారులు వచ్చి తన ఎదురుగా నిలబడాలని కోరుకోవడం లేదని, రాజకీయాల్లో హుందాగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.
అసెంబ్లీలో గొంతెత్తిన జిల్లా ఎమ్మెల్యేలు
Comments
Please login to add a commentAdd a comment