ఉల్లాసంగా.. ఉత్సాహంగా
మద్నూర్(జుక్కల్)/లింగంపేట(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం, పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో సరస్వతి మాత చిత్రపటానికి పూల మాలలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల నోడల్ అధికారి మల్లేశం మాట్లాడారు. అలాగే లింగంపేట మండలం శెట్పల్లి ఉన్నత పాఠశాలలో పదోతరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా గడిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హెచ్‌ఎంలు నాగ్‌నాథ్, వసుధ, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment