ఆభరణాలు ఎత్తుకెళ్లిన నిందితుల రిమాండ్
నిజాంసాగర్(జుక్కల్): మహిళను నమ్మించి నగలు ఎత్తుకు వెళ్లిన ఆటో డ్రైవర్ సుందర్‌రాజుతోపాటు వడ్డే లక్ష్మిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు బాన్సువాడ రూరల్ సీఐ రాజేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. సంగారెడ్డి జిల్లా మార్డి గ్రామానికి చెందిన మ్యాతరి భూమవ్వ ఆదివారం అచ్చంపేట వెళ్లడానికి నిజాంసాగర్ బస్టాండ్ సమీపంలోని రోడ్డుపై నిల్చుంది. ఆటోలో వచ్చిన సుందర్‌రాజుతోపాటు వడ్డె లక్ష్మి కలిసి భూమవ్వను అచ్చంపేటకు తీసుకెళ్తామని నమ్మించి ఆటోలో ఎక్కించుకున్నారు. నిర్మానుష్య ప్రదేశంలో ఇద్దరు కలిసి భూమవ్వ మెడలోని రెండు తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. సోమవారం బొగ్గు గుడిసె చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటో డ్రైవర్ పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. వారిని విచారించగా భూమవ్వ వద్ద చోరీకి పాల్పడినట్లు తెలిపారు. వెంటనే వారి వద్ద నుంచి పోలీసులు ఆభరణాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్, కానిస్టేబుళ్లు శ్యామ్, మహేష్‌లను సీఐ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment