కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
కామారెడ్డి టౌన్/బాన్సువాడ : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ముందు నాయకులు సంబురాలు జరుపుకున్నారు. బాన్సువాడలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేసి టపాసులు పేల్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీఎం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు చాట్ల రాజేశ్వర్, షేరు, కన్నయ్య, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు ప్రవీణ్, నాయకులు సంపంగి, శంకర్, సాప శివరాములు, మల్లయ్య, రాజేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించినందుకు..
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు
Comments
Please login to add a commentAdd a comment