సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తోట
నిజాంసాగర్(జుక్కల్): ఎస్సీ వర్గీకరణ బిల్లు కు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో రాష్ట్ర ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం సాయంత్రం మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, మానకొండూర్ ఎమ్మెల్యే సత్యనారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తదితరులున్నారు.
పక్కా ప్రణాళికతో చదవాలి
గాంధారి/నస్రుల్లాబాద్ : పదో తరగతి విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈవో రాజు అన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించి తాము చదివిన పాఠశాలకు, పాఠాలు బోధించిన ఉపాద్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. గాంధారి, నస్రుల్లాబాద్ మండలాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గాంధారి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 111 మంది పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్య సమకూర్చిన పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులను అందజేశారు. అలాగే నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి జెడ్పీహెచ్‌ఎస్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు. ఆయనవెంట ఎంఈవోలు శ్రీహరి, చందర్, గాంధారి హెచ్‌ఎం వెంకటేశ్వర్లుగౌడ్, నస్రుల్లాబాద్ మండల పీఆర్టీయూ అధ్యక్షుడు హన్మాండ్లు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కొనసాగుతున్న
ఇంటర్ పరీక్షలు
కామారెడ్డి టౌన్: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష జరిగింది. మొత్తం 38 కేంద్రాలలో 8423 మంది విద్యార్థులకు గాను 8243 మంది హాజరుకాగా, 180 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 7140 మంది జనరల్ విద్యార్థ్లుకు గాను 6999 మంది హాజరు కాగా, 141 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ కోర్సులో 1283 మందికి గాను 1244 హాజరుతో 39 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు.
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే తోట
Comments
Please login to add a commentAdd a comment