మాచారెడ్డి : పాల్వంచ మండల కేంద్రంలో అను మతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ, రెండు ట్రా క్టర్లను మాచారెడ్డి పోలీసులు గురువారం సీజ్ చేశా రు. ఈ సందర్భంగా ఎస్సై అనిల్ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మోపాల్‌లో పొక్లెయిన్, ట్రాక్టర్..
మోపాల్ : మండలంలోని బాడ్సి గ్రామ వాగులోంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న పొక్లెయిన్, ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రి వాగులో ఇసుక తవ్వుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకొని ఆరుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
రుద్రూర్‌లో రెండు టిప్పర్లు..
రుద్రూర్: మండలంలోని లక్ష్మీపూర్ క్యాంపు శివారులో బుధవారం రాత్రి రెండు ఇసుక టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో టిప్పర్లను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.