అనాథలైన పిల్లలెందరో.. | - | Sakshi
Sakshi News home page

అనాథలైన పిల్లలెందరో..

Published Sat, Mar 22 2025 1:20 AM | Last Updated on Sat, Mar 22 2025 1:15 AM

అనాథల

అనాథలైన పిల్లలెందరో..

జీవితాలను అతలాకుతలం చేసిన కరోనా

జిల్లాలో 341 మంది మృత్యువాత

వేలాది మంది ఆస్పత్రులపాలు

వైద్యం కోసం రూ. లక్షలు ఖర్చు

ఇప్పటికీ కోలుకోని

కుటుంబాలెన్నో..

జనతా కర్ఫ్యూకు ఐదేళ్లు

కరోనా వైరస్‌ ఎన్నో జీవితాలను బలి తీసుకుంది. ఇంకెన్నో కుటుంబాలను కోలుకోలేని విధంగా చేసింది. జిల్లాలో వేలాది మంది కోవిడ్‌తో ఆస్పత్రుల పాలయ్యారు. కొందరు మృత్యువుతో పోరాడి తనువు చాలించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించి శనివారంతో ఐదేళ్లవుతోంది. ఈ సందర్భంగా జిల్లాలో ఆనాటి పరిస్థితులపై కథనం..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కరోనా వైరస్‌ అన్ని దేశాలను వణికించింది. మన దేశంలోనూ వైరస్‌ ప్రభా వం కనిపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడికి అనేక చర్యలు తీసుకున్నాయి. మొదటగా 2020 మార్చి 22న దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విధించారు. ఏ ఒక్కరూ గ డప దాటొద్దని పిలుపునివ్వగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కో విడ్‌ను అదుపు చేయడానికి ప్రభు త్వం మరుసటి రోజు నుంచే లాక్‌డౌన్‌ విధించింది. ఎన్నడూ ఊహించని రీతిలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. నెలల తరబడిగా లాక్‌డౌన్‌ కొనసాగడంతో జనజీవనం ఆగమైంది. తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. కోవిడ్‌ బారిన పడి వేలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇంట్లో ఒకరికి కరోనా సోకిందంటే చాలు కుటుంబసభ్యులందరూ వైరస్‌ బారిన పడ్డారు. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 14,093 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 341 మంది మృత్యువాతపడ్డారు. అయితే ప్రైవేటు ఆస్పత్రులు, ఇంటి వద్ద చికిత్సలు పొందిన వారు, మృతిచెందినవారు అంతకన్నా రెట్టింపు సంఖ్యలో ఉంటారు.

ఒక్కరితో మొదలై..

2020 మార్చి 27న కామారెడ్డి పట్టణ పరిధిలోని దే వునిపల్లికి చెందిన ఓ వృద్ధుడు హైదరాబాద్‌ ఆస్ప త్రిలో చేరగా.. అతడికి కోవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులందరినీ హోం క్వా రంటైన్‌ చేశారు. చుట్టుపక్కల రోడ్లన్నింటినీ మూసివేసి కట్టడి చేశారు. ఆ ప్రాంతాన్ని సానిటైజ్‌ చేశారు. ఇరుగుపొరుగు నివసించే వారందరికీ పరీక్షలు చేశా రు. అదే సమయంలో ఢిల్లీకి వెళ్లొచ్చిన బాన్సువాడ, కామారెడ్డి, పిట్లం ప్రాంతాలకు చెందిన పలువురికి కరోనా నిర్ధారణ అయ్యింది. వారి ద్వారా వారి కు టుంబ సభ్యులకు కరోనా వ్యాపించింది. కోవిడ్‌ కట్ట డికి జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి బాధితులకు సేవలందించారు. అయినా ఏప్రి ల్‌, మే, జూన్‌, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో కరోనా వ్యాప్తి వేగంగా జ రిగింది. కాగా కోవిడ్‌తో ఆస్పత్రుల పాలై చికిత్సలు పొంది కోలు కున్న వారిలో చాలామంది ఇప్పటికీ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.

బంధాలను తెంచేసిన వైరస్‌

కరోనా సమయంలో ఎవరికి ఎవ రూ కాకుండాపోయారు. వైరస్‌ బా రిన పడి ఆస్పత్రిలో ఉన్న వారి వద్దకు కుటుంబ సభ్యులు కూడా వెళ్లి పరామర్శించే సాహసం చేయలేకపోయారు. కోవిడ్‌తో చ నిపోయిన వారి అంత్యక్రియల కు కూడా హాజరుకాలేని పరిస్థితులు ఎదురయ్యాయి. మున్సిపల్‌, పంచాయతీ కార్మికులు ట్రాక్టర్లలో శవాలను తీసుకువెళ్లి, పొక్లెయిన్‌లతో గుంతలు తవ్వించి ఖననం చేయాల్సి వచ్చింది. హైదరాబాద్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను అక్కడే దహనం చేయించారు. చివరి చూపునకూ కుటుంబ సభ్యులు నోచుకోలేకపోయారు. కొందరు మాత్రమే ధైర్యం చేసి రక్షణ చర్యలు తీసుకుని దూరం నుంచి ఆఖరు చూపు చూశారు. కరోనా కాలంలో సాధారణ మరణం సంభవించినా సరే కనీసం శవాన్ని మోయడానికి రక్త సంబంధీకులు కూడా రాలేదు.

లారీలో తరలివెళ్తున్న వలసకూలీలు (ఫైల్‌)

లాక్‌డౌన్‌ సమయంలో ఖాళీగా ఉన్న కామారెడ్డి బస్టాండ్‌ (ఫైల్‌)

అప్పుల పాలు..

జిల్లాలో కరోనా మహమ్మారి చాలా కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది. కొన్ని కుటుంబాల్లో భార్య, భర్త ఇద్దరూ కరోనాతో చనిపోయారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. మరికొన్ని కుటుంబాల్లో తల్లి లేదా తండ్రి చనిపోయారు. జిల్లాలో తల్లి, తండ్రి ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు 17 మంది ఉండగా, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలు 198 మంది ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పిల్లల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాయి.

కరో నా బారిన పడి ఆస్పత్రుల్లో చేరిన వారి వైద్యం కో సం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కొందరికి రూ.10 లక్షల నుంచి రూ. 20 లక్షల దాకా ఖర్చయ్యాయి. పాల్వంచ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు కరోనా బారిన పడగా వైద్యానికి రూ. 16 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో అతడి కుటుంబం దిక్కులేనిదయ్యింది. ఇదే సమయంలో వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చేందుకు ఆ కుటుంబం ఆస్తులు అమ్మాల్సి వచ్చింది. చాలామంది కరోనా వైద్యానికి చేసిన అప్పుల నుంచి తేరుకోలేకపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అనాథలైన పిల్లలెందరో..1
1/1

అనాథలైన పిల్లలెందరో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement