‘మహిళలు చట్టాలపై అవగాహన కలిగిఉండాలి’
కామారెడ్డి టౌన్ : మహిళలు చట్టాలు, హ క్కులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇంస్లాపురా కాలనీలో కేఆర్‌కే సన్‌షైన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లా డుతూ అడపిల్లలపై వివక్ష చూపవద్దన్నారు. మహిళా చట్టాలు, హక్కులపై అవగాహన క ల్పించారు. న్యాయపరమైన సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ (15100)కు కాల్ చేయాల ని సూచించారు. చిన్నపాటి సమస్యలుంటే కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్‌లో పరిష్కరించుకోవచ్చన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషాలిటీ వైద్య సేవలు
కామారెడ్డి టౌన్ : జిల్లాలోని వైద్య విధాన ప రిషత్ పరిధిలోగల ప్రభుత్వ ఆస్పత్రులలో స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులో ఉన్నాయని డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 18 న ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చే శామని తెలిపారు. జిల్లా ఆస్పత్రితో పాటు బాన్సువాడ, దోమకొండ, మద్నూర్, ఎల్లారె డ్డి ఏరియా ఆస్పత్రులలో గైనకాలజిస్ట్, అనస్తిషియాలజిస్ట్, ఆర్థోపెడిక్, రేడియాలాజిస్ట్, ఈఎన్‌టీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు 24 గంట ల పాటు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
‘మక్కిన తర్వాతే
పంట కోయాలి’
బాన్సువాడ : ధాన్యం గింజలు మక్కిన త ర్వాతనే పంటను కోయాలని డీఏవో తిరుమ ల ప్రసాద్ సూచించారు. శుక్రవారం బాన్సువాడ వ్యవసాయ శాఖ కార్యాలయంలో వరికోత యంత్రాల యజమానులు, ఏజెంట్లు, డ్రైవర్లకు వరి కోతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రభుత్వం అందించే బోనస్ కు ఏ రకం ధాన్యం వర్తిస్తుందో వివరించా రు. యంత్రం ద్వారా ధాన్యం గింజల పొడ వు, వెడల్పుల కొలతలు తీసుకునే విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ విజేందర్, సి విల్ సప్లయ్ అధికారి మల్లికార్జున్‌బాబు, జి ల్లా వ్యవసాయ సంచాలకులు అరుణ, బా న్సువాడ ఏడీఏ లక్ష్మీప్రసన్న, సహకార సంఘం అధ్యక్షులు కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
24న కాంగ్రెస్ పార్టీ సమావేశం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్‌లో ఈనెల 24వ తేది మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యేలు పోచారం, మదన్ మోహన్‌రావు, లక్ష్మీకాంతారావు హాజరయ్యే సమావేశాన్ని పార్టీ నేతలు విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు పండ్ల రాజు, గూడెం శ్రీనివాస్ రెడ్డి, నాయకులు శ్రీనివాస్, రాజాగౌడ్, శ్రీనివాస్ యాదవ్, అశోక్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్, కిషన్‌రావు, కన్నయ్య, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు
కై లాస్ శ్రీనివాస్‌రావు
‘మహిళలు చట్టాలపై అవగాహన కలిగిఉండాలి’
‘మహిళలు చట్టాలపై అవగాహన కలిగిఉండాలి’
Comments
Please login to add a commentAdd a comment