సమస్యలు తెలుసుకోవడానికి పరిష్కార వేదిక
బిచ్కుంద(జుక్కల్) : విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడానికి ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్మన్ (సీజీఆర్‌ఎఫ్) ఎరుకల నారాయణ అన్నారు. శుక్రవారం బిచ్కుంద సబ్‌స్టేషన్‌లో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వినియోగదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు సేవలు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. వినియోగదారుల ఇళ్లకు వెళ్లి రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సభ్యులు సలంద్ర రామకృష్ణ, రాజాగౌడ్, కిషన్, డీఈ గంగాధర్, ఏడీఏ సంజీవ్ కుమార్, ఏఈ పవన్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment