తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూడాలని డీపీవో మురళి అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యదర్శుల ప్రత్యేక సమావేశానికి హాజరై ఆయన మాట్లాడారు. గ్రామాలలో అధికారులు పర్యటించి తాగునీటి సమస్యలను పరిష్కారించాలన్నారు. అలాగే ప్రతిగ్రామంలో 100శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, కార్యదర్శులు పాల్గొన్నారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): తాగునీటి కొరతను అధిగమించడానికి నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీవో మల్హారి సూచించారు. శుక్రవారం వాటర్ డే సందర్భంగా మండల కేంద్రంలోని వీధుల్లో కుళాయిల వద్ద గుంతలను పరిశీలించారు. కుళాయిలకు మోటార్లు ఏర్పాటు చేస్తే సీజ్ చేస్తామన్నారు. గ్రామ శివారులోని నర్సరీ, కంపోస్టు షెడ్డు, పరిశీలించారు. ఆయన వెంట కార్యదర్శి శ్రావణ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
నీటి చౌర్యానికి పాల్పడితే కేసులు నమోదు చేస్తాం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గ్రామీణ ప్రాంతాలు, తండాల్లో నీటి చౌర్యానికి పాల్పడితే పోలీసు కేసులు నమోదు చేయిస్తామని మండల మిషన్ భగీరథ ఏఈ విష్ణు, ఎంపీవో మల్హారి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని సురాయిపల్లి ఎర్రోళ్ల తండా, జగదాంబ తండా, కొట్టాల్‌గడ్డ తండాలకు చెందిన పలువురు రైతులు మిషన్ భగీరథ పైపులైన్ గ్రిడ్‌కు అమర్చిన ఎయిర్ వాల్స్ నుంచి నీటి చౌర్యానికి పాల్పడుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు.
100 శాతం ఇంటి పన్ను
వసూలు చేయాలి
డీపీవో మురళి
Comments
Please login to add a commentAdd a comment