పరిశ్రమలు ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

Published Sun, Mar 23 2025 9:07 AM | Last Updated on Sun, Mar 23 2025 9:02 AM

పరిశ్

పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

అసెంబ్లీ సమావేశాల్లో

జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

నిజాంసాగర్‌: అత్యంత వెనకబడిన జుక్కల్‌ నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పాల ని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆయన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో మాట్లాడారు. శ్రామిక శక్తిలో, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం ఎనలేనిదన్నారు. మహిళలకు వ్యా పార రంగంలో అవకాశాలు ఇవ్వాలని, పరిశ్రమలను ఏర్పాటు చేసి వారిని భాగస్వాములను చేయాలని కోరారు. నియోజకవర్గంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టుతోపాటు 150 చెరువు లు ఉన్నాయని, ఫిష్‌ మార్కెటింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంద ని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సో యా పంట పండే జుక్కల్‌ నియోజకవర్గంలో సోయా, చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూని ట్లు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై పరి శ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఫిష్‌ మార్కెటింగ్‌ సౌ కర్యంతోపాటు సోయా ఆధారిత పరిశ్రమ లు ఏర్పాటు చేయిస్తామని పేర్కొన్నారు.

‘మత్స్యకారులకు

ఇన్సూరెన్స్‌ తప్పనిసరి’

నిజాంసాగర్‌: చేపల వేటపై ఆధారపడి జీవి స్తున్న మత్స్యకారులకు ఇన్సూరెన్స్‌ తప్పనిసరని ఆ శాఖ జిల్లా అధికారి శ్రీపతి పేర్కొన్నారు. శనివారం అచ్చంపేట మత్స్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మత్స్యకారుల సదస్సులో ఆయన మాట్లాడారు. చేప ల వేట సమయంలో సంభవిస్తున్న ప్రమాదాల్లో కార్మికులు మృత్యువాత పడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీమా చేసుకోవాలన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి ఉద్దేశించిన ప్రధానమంత్రి మత్స్య సంపద పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జలయజ్ఞం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎఫ్‌డీవో డోలిసింగ్‌, ఫీల్డ్‌మెన్‌ నవీన్‌, అత్తర్‌, సంపత్‌, ఎల్లేష్‌, జయరాం తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

ఎస్సెస్సీ పరీక్షలు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన హిందీ పరీక్షకు 12,579 మంది విద్యార్థులకు గాను, 12,554 మంది హాజరయ్యారు. 25 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఈవో రాజు తెలిపారు.

వొకేషనల్‌ పరీక్షకు 60 మంది గైర్హాజరు

కామారెడ్డి టౌన్‌: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ పరీక్షకు 60 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్మీడియట్‌ జిల్లా నోడల్‌ అధికారి షేక్‌ సలాం తెలిపారు. 1,123 మంది విద్యార్థులకుగాను 1,063 మందే పరీక్ష రాశారని పేర్కొన్నారు.

26న బల్దియా తైబజార్‌, మేకల సంత వేలం

కామారెడ్డి టౌన్‌: మున్సిపాలిటీ పరిధిలోని తైబజార్‌, మేకల సంతకు సంబంధించి ఈ నెల 26న బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని బల్దియా కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ కార్యాలయంలో 26న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తిగలవారు వేలంలో పాల్గొనాలని, ఇతర వివరాలకు బల్దియా కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

దెబ్బతిన్న పంటల

వివరాలు సేకరించాలి

నిజామాబాద్‌ సిటీ: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించాలని రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యుడు గడుగు గంగాధర్‌ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. యాసంగిలో సాగుచేస్తున్న పంటలు, అందులో వడగళ్ల వానకు దెబ్బతిన్న వాటి వివరాలు సేకరించాలని తెలిపా రు. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. వ్యవసాయ కమిషన్‌ రైతులకు అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పరిశ్రమలు ఏర్పాటు చేయాలి 
1
1/1

పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement