చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి
బాన్సువాడ : ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి సోమవారం నిర్వహించే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు రవీందర్ అన్నారు.ఆశవర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి రూ.18 వేల వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆశ వర్కర్లు లావణ్య, గంగమణి, అనురాధ, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
బార్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమమైంది. ఎన్నిక అధికారు లు వెంకటేశ్వర్, ఆర్‌ఎస్‌ఎల్ గౌడ్ జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించారు.మార్చి 26వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment