ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ చేసి నిర్మాణాలు ప్రారంభించాలని డీపీవో, మండల ప్రత్యేకాధికారి మురళి అన్నారు. శనివారం ఆయన మండలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో రాజేశ్వర్, ఎంపీవోలక్ష్మి నారాయణ, ఏఈలు దామోదర్, భాను చందర్, ఏపీవో శ్రుతి తో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షించారు. పలు విషయాలపై చర్చించి సూచనలు చేశారు.కార్యక్రమంలో జీపీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
బీబీపేట/నాగిరెడ్డిపేట : బీబీపేట మండలం శివారు రాంరెడ్డిపల్లి, నాగిరెడ్డిపేట మండలం అచ్చాయపల్లిలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో ప్రభాకరచారి పరిశీలించారు. శనివారం గ్రామాల్లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. అనంతరం యాడారం గ్రామంలో నర్సరీ, తాగునీటి వసతులను పరిశీలించారు. బీబీపేట లో ఉన్నటువంటి నర్సరీలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించి తగిన సలహాలు ఇచ్చారు. మల్కాపూర్‌లో జరగుతున్న సీసీ రోడ్ల పనులను సందర్శించారు. ఆయన వెంట ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, కార్యదర్శి వెంకట స్వామి, పంచాయతీ కార్యదర్శి వెంకటరామలు, ఫీల్డ్‌అసిస్టెంట్ మల్లేశం తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment