
భారత సాఫ్ట్‌బాల్ జట్టుకు విద్యార్థిని ఎంపిక
జక్రాన్‌పల్లి : మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన గన్న వర్షిణి భారత సాఫ్ట్‌బాల్ అండర్–15 సబ్‌జూనియర్ జట్టుకు ఎంపికై ంది. ఈనెల 25 నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగే ఏషియన్ చాంపియన్‌షిప్ పోటీల్లో వర్షిణి పాల్గొననుంది. అంతర్జాతీయ పోటీల్లో భారత జట్టు తరఫున వర్షిణి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో మునిపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తంచేశారు. మాజీ సర్పంచ్ ముస్కు చిన్న సాయిరెడ్డి ఆదివారం వర్షిణిని సన్మానించారు. ఖర్చుల నిమిత్తం రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు నరేశ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల
నిర్మాణానికి ముగ్గులు
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం దోస్త్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆదివారం హౌసింగ్ డీఈఈ గోపాల్, ఎంపీడీవో శ్రీనివాస్ ముగ్గులు వేయించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం, భవనాలకు సంబందించి మార్కింగ్ వేయించారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment