
గేదెను తప్పించబోయి ట్రాక్టర్ బోల్తా
మాక్లూర్: అడ్డుగా వచ్చిన గేదెను తప్పించబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడగా ఒకరు మృతి చెందిన ఘటన ఆదివారం నందిపేట మండలం సీహెచ్ కొండూర్ శివారులో చోటు చేసుకుంది. నందిపేట పోలీసుల కథనం ప్రకారం.. వెల్మల్ గ్రామానికి చెందిన చిన్నోల్ల సాయిలు(51) నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి వద్ద వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. నిత్యకృత్యంలో భాగంగా తన ట్రాక్టర్‌పై వెల్మల్ నుంచి పంచగుడిలోని పొలానికి వెళుతున్నాడు. సీహెచ్ కొండూర్ వద్ద ఒక్కసారిగా గేదె అడ్డురావడంతో దాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో ట్రాక్టర్ నడుపుతున్న చిన్నోల్ల సాయిలుకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్సులో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఒకరి దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment