
పాపం బాలుడిని ఆదుకోరూ!
డొంకేశ్వర్(ఆర్మూర్): పాఠశాల తరగతి గదిలో ఉండాల్సిన సమయంలో ఆస్పత్రిలో చేరి మహమ్మారి వ్యాధితో పోరాడుతున్నాడు బాలుడు నిర్విన్ తేజ్. డొంకేశ్వర్ మండలం గంగాసముందర్ గ్రామానికి చెందిన మోతె అశోక్, గంగామణిల కుమారుడు నిర్విన్ తేజ్ తొండాకూర్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఇటీవల సైకిల్ పైనుంచి పడడంతో కాలుకు పెద్ద గాయం తగిలింది. చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు రక్త పరీక్షలు చేశారు. అందులో తెల్లరక్త కణాలు ఎక్కువగా ఉండటంతో మరిన్ని పరీక్షలు చేయగా బాలుడికి (అక్యూట్ మైలోయిడ్ లుకేమియా) బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఎంఎంజే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారం రోజులుగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోజుకు కొన్ని యూనిట్ల రక్తం అవసరం అవుతోంది. ఇప్పటికే రూ. నాలుగైదు లక్షల వరకు ఖర్చు అయింది. ఇంకా పదిహేను రోజుల వరకు వైద్యం అందించాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. తల్లిదండ్రులది నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులకు స్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ముందుకు వచ్చి తన కొడుకును కాపాడాలని వేడుకుంటున్నారు.
బ్యాంక్ అకౌంట్ వివరాలు..
తండ్రి: మోతె అశోక్
బ్యాంకు ఖాతా నంబరు: 75010100025228
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : UBIN0817503
ఫోన్ పే నంబర్: 9705612610 (గంగామణి, తల్లి)
లుకేమియాతో
బాధపడుతున్న నిర్విన్ తేజ్
ఆపన్నహస్తం కోసం
తల్లిదండ్రుల ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment