
మోడల్ హౌస్ పరిశీలన
లింగంపేట : మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను హౌసింగ్ డిపార్ట్‌మెంట్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ విజయపాల్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల్లో మోడల్ హౌస్‌ల నిర్మాణం కొనసాగుతోందన్నారు. కొన్ని మండలాల్లో స్లాబ్ లెవల్‌లో, మరికొన్ని మండలాల్లో రూఫ్‌లెవల్‌లో పనులు ఉన్నాయని పేర్కొన్నారు. మోడల్ హౌస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేశామన్నారు. ఆయన వెంట డీఈ శుభాష్, ఏఈ అశోక్, ఎంపీడీవో నరేష్ తదితరులు ఉన్నారు.
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో
సత్తా చాటిన క్రీడాకారులు
కామారెడ్డి అర్బన్: రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు బి.ఈశ్వర్‌ప్రసాద్, ఎల్.సునీత సత్తాచాటారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన జావెలిన్ త్రో అండర్–20 విభాగంలో ఈశ్వరప్రసాద్ రజత పతకం సాధించగా.. 400 మీటర్ల పరుగు పందెం అండర్–18 విభాగంలో సునీత కాంస్య పతకం సాధించారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ తెలిపారు. పతకాలు సాధించిన క్రీడాకారులతోపాటు కోచ్ నవీన్‌కుమార్, మేనేజర్ అనిల్‌లను అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు.
పోచమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత
భిక్కనూరు: పోచమ్మ ఆలయం వద్దనున్న మర్రిచెట్టును నరికేందుకు కొందరు యత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివ రాలిలా ఉన్నాయి. భిక్కనూరు దళితవాడ సమీపంలో పోచమ్మ ఆలయం ఉంది. భక్తు లు ఏటా ఈ ఆలయం చుట్టూ ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఆ స్థలాన్ని కొనుగోలు చేశామంటూ ఆదివారం కొందరు వ్యక్తులు ఆల యం వద్దనున్న మర్రిచెట్టు కొమ్మలను నరక డం ప్రారంభించారు. దీనిని గమనించిన స్థా నికులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అన్య మత స్తులు ఆలయానికి సంబంధించిన మర్రిచెట్టును తొలగించేందుకు కుట్రచేశారని స్థానికులైన దళితులు ఆరోపిస్తున్నారు. అనంత రం ఆలయానికి సంబంధించిన భూమిని కా పాడాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు.

మోడల్ హౌస్ పరిశీలన

మోడల్ హౌస్ పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment