తాగునీటి మానిటరింగ్ సెల్ ఏర్పాటు
కామారెడ్డి క్రైం: జిల్లాలో ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి మానిటరింగ్ సెల్‌కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మానిటరింగ్ సెల్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాగు నీటి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే 99087 12421 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ మానిటరింగ్ సెల్ రోజూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తుందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నమోదు చేసుకుని సంబంధిత శాఖల అధికారుల ద్వారా సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీపీవో మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment