మొరం తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
జిల్లాలో జరుగుతున్న అక్రమమొరం తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కమిటీ ప్రతినిధులు వెంకటి గౌడ్, కొత్తనరసింహులు మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల పరిధిలో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. సంబంధిత అధికారులు మొరం వ్యాపారులతో కుమ్మకై ్కపోయారని ఆరోపించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వ్యాపారులకు సహకరిస్తున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment