బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టిసారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆయన తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం ఈ నెలాఖరు నుంచి నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిపై సమీక్షించనున్నారు.
ఏ మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల్లో బీజేపీకి అధిక ఓట్లు వచ్చాయి? ఏయే గ్రామాల్లో పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది? అత్యంత బలహీనంగా ఉన్న మండలాలు, గ్రామాలు ఏవి? అక్కడ పార్టీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? అనే అంశాలపై లోతుగా విశ్లేషించనున్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం 5 జిల్లాల్లో విస్తరించి ఉంది.
మొత్తం 40 మండలాలు, 671 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. 16,51,534 మంది ఓటర్లు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎంపీ సంజయ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. రాబోయే 45 రోజులపాటు మండలాల వారీగా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. సంక్రాంతి తర్వాత నేరుగా ప్రజల వద్దకు వెళ్లేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి: కేసీఆర్ త్వరగా కోలుకోవాలి... అసెంబ్లీకి రావాలి
Comments
Please login to add a commentAdd a comment