సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ బలపరిచిన అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డికి తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థి ఇన్నా రెడ్డి, సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్‌లను.. శనివారం తెలంగాణ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్ తదితరులు కలిసి మద్దతు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థితప్రజ్ఞ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు, ఓపీఎస్ సాధనే లక్ష్యంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో సీపీఎస్ అభ్యర్థి విజయం సాధించడం ద్వారా ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment